![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -543 లో..... ధీరజ్ , తిరుపతి తాగి గేట్ దగ్గరే పడుకుంటారు. దాంతో ప్రేమ ఉదయం లేచి వాళ్ళపై వాటర్ చల్లుతుంది. ఇక వాళ్ళు లేస్తారు. ఏంటే అని ప్రేమపై ధీరజ్ కోప్పడతాడు. ఆగు అల్లుడు నువ్వు రాత్రి వీర లెవల్లో మాట్లాడావ్ కదా దానికి రిజల్ట్స్ ఇది అని ధీరజ్ తో తిరుపతి అంటాడు.ప్రేమ, ధీరజ్ గొడవ పెట్టుకుంటుంటే వేదవతి వస్తుంది. ఎందుకు మీకు గొడవ అని అంటుంది. దాంతో ధీరజ్, తిరుపతి లోపలికి వెళ్తారు. ఎప్పుడు కలిసి ఉండే మీరు ఇలా గొడవ పడడం ఏంటని వేదవతి అడుగుతుంది.
అదంతా పక్కన పెట్టు.. పెద్దకోడలు అని చెప్పుకొని తిరిగే కోడలు ఉంది కదా తను లేచి పని చేయకుండా.. నువ్వు చేస్తున్నావ్ ఏంటి? ఆగు నేను చల్లుతానంటూ వాకిట్లో ప్రేమ నీళ్లు చల్లుతుంది. అప్పుడే నర్మద వచ్చి అబ్బో పుట్టింట్లో ఉన్నా కూడా అత్తింటి గురించే ఆలోచనా అని అంటుంది. ప్రేమ, నర్మద కలిసి ముగ్గు వేస్తుంటే ఇంటికి రావచ్చు కదా అని నర్మద, వేదవతి అడుగుతారు. మీరంటే నాకు కోపం లేదు అత్త.. ఎప్పుడు గౌరవమే అని ఉంటుంది. వాడు నలుగురిలో నా వ్యక్తిగత జీవితాన్ని బయట పెట్టాడు. అందుకే నాకు కోపం.. అలాంటి వాడితో ఎలా ఉంటానని ప్రేమ లోపలికి వెళ్తుంది. మరొకవైపు తిరుపతి కోసం సుకన్య వెయిట్ చేస్తుంది తిరుపతి వచ్చాక తనని కనిపించకుండా ఆటపట్టిస్తుంది. ఆకలిగా ఉందని తిరుపతి అనగానే సుకన్య టిఫిన్ తినిపిస్తుంది.
అప్పుడే భాగ్యం ఆనందరావు వస్తారు ఏంటి తిరుపతి మేం ఎవరు లేని టైమ్ లో ఇంటికి వచ్చావని అడుగుతుంది. వదిన అని తనతో మాట కలిపి త్వరలో మా ఇద్దరికి పెళ్లి.. సుకన్యని మా ఇంటికి కోడలుగా పంపించమని తిరుపతి అంటాడు. మరొకవైపు అమూల్య కోసం విశ్వ కాలేజీ దగ్గర వెయిట్ చేస్తాడు. అసలు నీకు బుద్ది లేదా అంటూ అమూల్య కోప్పడుతుంది. నేను మారిపోయానని విశ్వ రిక్వెస్ట్ చేస్తాడు. మనం కలిసి ప్రేమ ధీరజ్ ని ఒకటి చేద్దామని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.SEO Keywords:
![]() |
![]() |